Stock market-related terms | what is stock market volume| stock market Telugu
FIIs :-
అంటే(foriegn institutional investors) ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు వేరే దేశంలో నుండి మన దేశంలో పెట్టుబడి చేస్తుంటారు. వీళ్ళు ఒక ఫండ్ హౌస్ కావచ్చు లేదా పెద్ద కంపనీ అయి ఉండవచ్చు.
వీళ్లు మన ఎకానమీలో చాలా ముఖ్య పాత్రలు పోషిస్తుంటారు. వీళ్ళనే బిగ్ ప్లేయర్స్ అని కూడా పిలుస్తుంటారు ఒకరకంగా వీళ్ళ influence మన మార్కెట్ లో చాలా ఉంటుంది అని చెప్పుకోవాలి.
stock market terms to know
DIIs:-
అంటే (domestic institutional investors) డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మన దేశంలో ఉండే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపనీలు మరియు మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఇన్షూరెన్స్ కంపనీలు...etc లాంటివి మన దేశంలో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి చేస్తుంటాయి వీళ్ళని DII అంటారు.
PENNY STOCK:-
ఈ స్టాక్ యొక్క షేర్ ధర అనేవి చాలా తక్కువ ఉంటాయి. పది రూపాయలు లేదా అంత కంటే తక్కువ ధరలో ఉంటాయి. మరియు ఆ షేర్ యొక్క క్యాపిటలైజేషన్ అనేది వంద కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. వీటినే పెన్ని స్టాక్ అంటారు.
ఈ పెన్ని స్టాక్ లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న విషయం. ఎందుకంటే ఇవి ఎక్కువగా న్యూస్ మీద మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అమ్ముదాం అంటే కొనే వారు మరియు కొందామంటే అమ్మేవారు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా...... ఇద్దరి మద్య ధరలో చాల హెచ్చు తగ్గులు చాలా ఉంటాయి.
BLUECHIP COMPANIES:-
కొన్ని కంపెనీల వాల్యుయేషన్ వేలకోట్లలో ఉంటాయి మరియు ఆ కంపెనీలు అందరికీ బాగా తెలిసిన కంపనీలు అయ్యి ఉంటాయి. మరియు వాళ్ళ సెక్టార్లో టాప్ గా, మార్కెట్ లీడర్స్ గా ఉంటాయి. మంచి డివిడెండ్స్ ఇస్తూ నమ్మకంగా ఉంటాయి. ఇలాంటివి కంపనీలనే blue chip కంపనీలు అంటారు. ఉదాహరణకు RELIANCE INDUSTRIES,WIPRO,TCS,ITC..etc
VOLUME:-
volume అంటే ఒక కంపెనీ షేర్లు ఒకరోజులో లేదా ఒక టైమ్ ఫ్రేమ్ లో ఎన్ని exchange( చేతులు మారటం) అయ్యాయి అనే తెలిపే ఒక కొలమానం.
52 WEEK HIGH:-
52 weeks అంటే ఒక సంవత్సరం. 52 week high అంటే ఒక సంవత్సరంలో ఒక షేర్ ధర ఎంతైతే ఎక్కువ ఉంటుందో ఆ ధరని 52 week high అంటారు. ఉదాహరణకు ITC కంపనీ పోయిన సంవత్సరం ఇదే రోజు అంటే 20 august 2020 నుండి 20 august 2021 ఈ టైమ్ లో ఎక్కువగా వెళ్ళిన ధర 239.2 ఈ ధర నే 52 week high.
52 WEEK LOW:-
పైన చెప్పుకున్నట్టు ఒక సంవత్సర కాలంలో ఆ షేర్ వెళ్ళిన తక్కువ ధరను 52 week low గా పిలుస్తారు. ఉదాహరణకు పైన ఫోటోని గమనిస్తే 163.35 అనేది ITC యొక్క 52 week low.
stock market terms to know
ALL TIME HIGH:-
అంటే ఒక కంపెనీ తను స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పడి నుండి ఎప్పుడు వెళ్లని ఎక్కువ ధరను all time high అని పిలుస్తారు.
ALL-TIME LOW:-
అంటే ఒక కంపెనీ తను స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పడి నుండి ఎప్పుడు వెళ్లని తక్కువ ధరను all time low అని పిలుస్తారు.
EPS:-
Eps అంటే Earnings per share... అంటే సింపుల్గా ఒక కంపెనీకి లాభం వస్తే ఆ లాభాన్ని ఆ కంపెనీలో ఉన్న షేర్ల తో భాగిస్తే వచ్చేదే EPS అంటాము.
ఈ ఆర్టికల్ కి ఇంతే.........
0 Comments